హైదరాబాద్, 29 ఆగస్టు (హి.స.)
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో మాజీ మంత్రి హరీశ్రావు సమావేశం అయ్యారు. ఈ మేరకు శుక్రవారం ఎర్రవల్లి ఫామ్ హౌస్లో గులాబీ బాస్లో హరీశ్రావు భేటీ అయ్యారు. రేపటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇద్దరి మధ్య కీలక చర్చలు జరుగుతున్నాయి. అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం కాళేశ్వరం కమిషన్ నివేదికను సభలో ప్రవేశ పెట్టనున్న విషయం తెలిసిందే. దానిని ఎలా ఎదుర్కోవాలనే అంశంపై చర్చిస్తున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. ఈ చర్చల అనంతరం అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ నేతలకు గులాబీ బాస్ దిశానిర్దేశం చేయనున్నారు. నిన్న సాయంత్రం నుంచి హరీశ్ రావు ఫామ్ హౌస్లోనే ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న చర్చల్లో పార్టీ సీనియర్ నేతలు పాల్గొనే అవకాశం ఉన్నట్లు సమాచారం.
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్