అమరావతి, 29 ఆగస్టు (హి.స.)తణుకు, కాకినాడ, గుంటూరు, తిరుపతిలో భారీగా టీడీఆర్ బాండ్ల కుంభకోణం జరిగినట్టు వైసీపీ హయాంలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. నెల్లూరుకు చెందిన టీడీపీ నేత ఆనం వెంకటరమణారెడ్డి గతంలో తిరుపతిలో ప్రెస్‌మీట్ పెట్టి టీడీఆర్ బాండ్ల స్కాంపై ఆరోపణలు చేశారు. రూ.4 వేల కోట్ల మేర కుంభకోణం అక్కడ జరిగిందని ఆయన విమర్శించారు. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో నిర్మించిన రోడ్లతో స్థలాలు కోల్పోయిన వారికి మొత్తం 1417 బాండ్లు జారీచేయాలని వైసీపీ నాడు నిర్ణయించింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ