కామారెడ్డి, 29 ఆగస్టు (హి.స.)
యుద్ధ ప్రాతిపదికన రోడ్డు మరమ్మత్తు పనులు చేయించి రవాణా సౌకర్యం పునరుద్ధరించాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం నాడు ఆయన భిక్కనూరు మండల కేంద్రంలోని దాసనమ్మకుంట ద్వారా, కొత్త దళితవాడకు వెళ్లే తెగిపోయిన బీటీ రోడ్డును పరిశీలించారు. సుమారు 600 మంది జనాభా ఉన్న ఆ కాలనీకి, రాకపోకలు నిలిచిపోవడం వలన ప్రజలు తాగునీటితోపాటు ప్రజలు అన్ని రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కాలనీవాసులతోపాటు, వివిధ పార్టీల నాయకులు ఆయన దృష్టికి తీసుకువచ్చారు. వెంటనే అధికారులను పిలిచి తక్షణమే పనులు ప్రారంభించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పనుల ప్రోగ్రెస్కు సంబంధించి రిపోర్టులు ఎప్పటికప్పుడు పంపించాలని ఆదేశించారు. అనంతరం అక్కడి నుంచి దక్షిణ కాశీ సిద్ధ రామేశ్వరాలయానికి వెళ్లే దెబ్బతిన్న రోడ్డు దగ్గరకు వెళ్లి పరిశీలించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..