మహబూబాబాద్, 29 ఆగస్టు (హి.స) మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే భూక్య మురళి నాయక్ క్యాంపు కార్యాలయాన్ని రైతులు ముట్టడించారు. శుక్రవారం యూరియా కోసం పట్టణ కేంద్రానికి రెడ్యాల, కంబాలపల్లి రైతులు వచ్చారు.అధికారులు యూరియా లేదని చెప్పడంతో ఆగ్రహించిన రైతులు పట్టణంలో ఉన్న ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించారు. యూరియా ఇచ్చేదాకా ఇక్కడి నుంచి కదిలేది లేదని నినాదాలు చేశారు. ఒక దశలో క్యాంపు కార్యాలయ గేట్లను పోలీసులు మూసివేయగా వాటిని తోసుకుంటూ లోపలికి వెళ్లారు. చివరకు ఎమ్మెల్యే వ్యవసాయ అధికారులకు ఫోన్ చేసి రైతులకు యూరియా పంపిణీ చేయాల్సిందిగా సూచించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..