వరద ప్రాంతాలను పర్యవేక్షించిన నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి షర్మిల..
నిర్మల్, 29 ఆగస్టు (హి.స.) బాసర గోదావరి బ్యాక్ వాటర్ కారణంగా ముంపు ప్రాంతాల్లో చిక్కుకున్న వరద బాధితులను నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి షర్మిల శుక్రవారం పరామర్శించారు. వారి బాగోగులు అడిగి తెలుసుకున్నారు. వరదల్లో చిక్కుకున్న మొదటి అంతస్తులో సురక్షితంగా
నిర్మల్ ఎస్పీ


నిర్మల్, 29 ఆగస్టు (హి.స.)

బాసర గోదావరి బ్యాక్ వాటర్ కారణంగా ముంపు ప్రాంతాల్లో చిక్కుకున్న వరద బాధితులను నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి షర్మిల శుక్రవారం పరామర్శించారు. వారి బాగోగులు అడిగి తెలుసుకున్నారు. వరదల్లో చిక్కుకున్న మొదటి అంతస్తులో సురక్షితంగా ఉన్నట్లు వరద బాధితులు షర్మిలకు తెలిపారు. వారికి కావలసిన మంచి నీరు, ఆహారం బట్టలు స్థానిక సర్పంచ్ లక్ష్మణరావు, మీడియా సహకారంతో అందిస్తామని తెలిపారు. వరద మరింత స్థాయికి పెరిగితే సురక్షిత ప్రాంతాలకు వారిని చేర్చడానికి ముందుగానే సమాయత్తం అయ్యామని మీడియాకు తెలిపారు. ఆమె వెంట ఏఎస్పీ అవినాష్, సీఐ మల్లేష్, ఎస్సై శ్రీనివాస్ లు ఉన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande