హైదరాబాద్, 29 ఆగస్టు (హి.స.)
ఎగువ నుంచి జంట జలాశయాలకు
భారీగా వరద వస్తున్నది. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జలాశయాలు పూర్తిస్థాయిలో నిండటంతో జలమండలి అధికారులు ఉస్మాన్సాగర్ 8 గేట్లు ఎత్తారు. మూసీ నదిలో వరద ఉధృతి పెరగడంతో మంచిరేవుల బ్రిడ్జిపై నుంచి వరద ప్రవహిస్తున్నది. అప్రమత్తమైన అధికారులు నార్సింగి వద్ద ఓఆర్ఆర్ (ORR) సర్వీస్ రోడ్డును మూసివేశారు. సర్వీస్ రోడ్డు ఎంట్రీ, ఎగ్జిట్ను మూసివేడంతో మంచిరేవుల-నార్సింగి మార్గంలో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో వాహనదారులు ఇతర మార్గాల ద్వారా వెళ్లాలని అధికారులు సూచించారు.
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్