సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ఒవైసీ బ్రదర్స్.. కీలక అభ్యర్థన
హైదరాబాద్, 29 ఆగస్టు (హి.స.) తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, ఎంఐఎం అసెంబ్లీ ఫ్లోర్ లీడర్ అక్బరుద్దీన్ ఓవైసీ శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మర్కజీ మిలాద్ జులూస్ కమిటీ సభ్యులు సీఎంకు వినతిపత్రం అం
ఓవైసీ బ్రదర్స్


హైదరాబాద్, 29 ఆగస్టు (హి.స.)

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, ఎంఐఎం అసెంబ్లీ ఫ్లోర్ లీడర్ అక్బరుద్దీన్ ఓవైసీ శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మర్కజీ మిలాద్ జులూస్ కమిటీ సభ్యులు సీఎంకు వినతిపత్రం అందజేశారు. మలాద్-ఉన్-నబీ సందర్భంగా నగర పరిధిలో ఉన్న పురాతన మసీదులతో పాటు దర్గాలను అలంకరించాలని, అందుకు కావాల్సిన విద్యుత్ను ఉచితంగా అందజేయాలని సీఎం రేవంత్కు విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా సెప్టెంబర్ 14న రాష్ట్ర వ్యాప్తంగా ఉలాద్-ఉన్-నబీ జూలూస్కు అనుమతి ఇవ్వాలని కమిటీ సభ్యులు వినతిపత్రంలో కోరారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్


 rajesh pande