హైదరాబాద్, 29 ఆగస్టు (హి.స.)
టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్ గా మార్చడంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ వాదంతో మొదలైన టీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు భారతీయ రాష్ట్ర సమితిగా మారిందని అన్నారు. ఎందుకంటే ఆ భావజాలానికి ఒక పరిమిత కాలం ఉందని అందుకే దాని వ్యవస్థాపకులు భారత రాష్ట్రసమితిగా మార్చుకున్నారని కామెంట్స్ చేశారు. నిన్న విశాఖపట్నంలో జరిగిన జనసేన ఎగ్జిక్యూటివ్ మీటింగ్ లో పవన్ కల్యాణ్ మాట్లాడారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ ప్రస్తానాన్ని చెప్పుకొచ్చిన పవన్... జనసేన భవిష్యత్ పై కీలక దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ అంశాన్ని ప్రస్తావించిన ఆయన తెలంగాణ భావజాలం పరిమితి కాలం చెల్లిందని అందువల్లే పేరు మార్చుకోవాలని టీఆర్ఎస్ నిర్ణయానికి వచ్చిందన్నారు. మరింత మెరుగుపడటానికి మార్పు అనివార్యం అని చెప్పారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్