మెదక్, 29 ఆగస్టు (హి.స.) ఏడుపాయల వనదుర్గ అమ్మవారి ఆలయం పూర్తిగా నీట మునిగింది. మంజీరానది ఉధృతితో గర్భగుడి ముందు నుంచి రేకులను తాకుతూ వరద ప్రవహిస్తున్నది. ఈ నేపథ్యంలో రాజగోపురంలో ఉత్సవ విగ్రహం ఏర్పాటు చేసిన అధికారులు.. భక్తులకు అమ్మవారి దర్శనం కల్పిస్తున్నారు. ఆనకట్ట వైపు భక్తులు వెళ్లకుండా పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు.
ఎగువన ఉన్న సింగూర్ జలాశయంలో నీటిమట్టం పెరగడంతో అధికారులు ప్రాజెక్టు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. దీంతో మంజీరా నదిలో భారీగా వరద ప్రవాహం పెరిగి ఏడుపాయల ఆలయం చుట్టూ జలమయం అయింది. గత 15 రోజులుగా అమ్మవారి ఆలయం జలదిగ్బంధంలోనే ఉన్నది.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు