తెలంగాణ, నారాయణపేట. 29 ఆగస్టు (హి.స.)
నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల
పథకంలో భాగంగా భూసేకరణ ప్రక్రియ అధికారులు చేపడుతున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం పోలీసుల పహారాలో కానుకుర్తి చెరువు సర్వే చేసేందుకు సిద్ధమయ్యారు. అంతకు ముందుగానే పలువురు రైతు సంఘం నాయకులను ముందస్తు అరెస్టు చేశారు. రైతులు తమకు న్యాయమైన పరిహారం ఇచ్చేవరకు ఒప్పుకునేది లేదని.. స్పష్టమైన హామీ ఇస్తేనే భూసేకరణకు సహకరిస్తామని తేల్చి చెప్పారు. దీంతో ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకోండి. కాగ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం పనులు చేపట్టడం అధికార పక్షానికి సవాల్ గా మారింది.పెట్రోల్ డబ్బాలు, పురుగుల మందులతో రైతులు భారీ నిరసన చేపట్టారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు