యూరియా కోసం రైతుల ఇక్కట్లు.. జాతీయ రహదారిపై బైఠాయించి ధర్నా
వికారాబాద్, 29 ఆగస్టు (హి.స.) ఎరువుల కోసం రైతులకు ఇక్కట్లు తప్పట్లేదు. గంటల తరబడి లైన్ లో నిలుచున్న కానీ ఎరువులు దొరకడం లేదు. దీంతో విసిగిపోయిన రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ షాబాద్ మండల కేంద్రంలో వ్యవసాయ సహాయ సహకార సంఘం ఎదుట జాతీయ రహదారిపై బైఠాయించ
యూరియా రైతుల ధర్నా


వికారాబాద్, 29 ఆగస్టు (హి.స.)

ఎరువుల కోసం రైతులకు ఇక్కట్లు

తప్పట్లేదు. గంటల తరబడి లైన్ లో నిలుచున్న కానీ ఎరువులు దొరకడం లేదు. దీంతో విసిగిపోయిన రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ షాబాద్ మండల కేంద్రంలో వ్యవసాయ సహాయ సహకార సంఘం ఎదుట జాతీయ రహదారిపై బైఠాయించి జై జవాన్, జై కిసాన్ నినాదాలు చేస్తూ శుక్రవారం ధర్నా నిర్వహించారు. ఎరువుల కోసం కడుపు మాడ్చుకొని గంటల తరబడి లైన్ లో నిలుచున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అయినా కానీ ఎరువులు లభించక రోజుల తరబడి వేచి చూడాల్సి వస్తుందని తెలిపారు. రైతులు ఒక రాజకీయ పార్టీలకు సంబంధించిన వారు కాదని మాకు వెంటనే ఎరువులు అందేలాగా చేయాలని ధర్నా నిర్వహించారు. కంది-బీజాపూర్ జాతీయ రహదారిపై రైతులు ధర్నా నిర్వహించడం తో రోడ్డుపై వాహనాలు స్తంభించిపోయాయి.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande