న్యూఢిల్లీ,29 ,ఆగస్టు (హి.స.) నటుడు విజయ్ (Actor Vijay) ఏర్పాటుచేసిన తమిళిగ వెట్రి కళగం (టీవీకే) పార్టీ సుప్రీంకోర్టు (Supreme Court)ను ఆశ్రయించింది. పరువు హత్యలకు సంబంధించిన ప్రత్యేక చట్టాన్ని రూపొందించాలని ఆ పార్టీ కోరింది. ఇటీవల రాష్ట్రంలో ఓ దళిత సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే టీవీకే జనరల్ సెక్రటరీ అధవ్ అర్జున్ సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశారు. పరువు హత్యలను అరికట్టేందుకు ప్రస్తుతం ఉన్న చట్టపరమైన నిబంధనలు సరిపోవడం లేదని ఆయన అందులో వాదించారు.
జులై 27న తిరునెల్వేలిలో ఐటీ ఉద్యోగి అయిన కవిన్ సెల్వగణేషన్ (27) హత్య ఇటీవల సంచలనం రేపింది. కవిన్ వేరొక సామాజిక వర్గానికి చెందిన యువతిని ప్రేమించాడు. ఇది నచ్చని ఆమె సోదరుడు సుర్జిత్, కవిన్‌ను హత్య చేశాడు. దీంతో సబ్-ఇన్‌స్పెక్టర్లుగా పనిచేస్తున్న నిందితుడి తల్లిదండ్రులు కృష్ణకుమారి, శరవణన్‌లు సస్పెండ్ అయ్యారు. ఈ హత్యకు సంబంధించి సుర్జిత్‌తో పాటు అతడి తండ్రి శరవణన్‌ను కూడా పోలీసులు అరెస్టు చేశారు. రాష్ట్రంలోని పలు పార్టీలు ఈ పరువు హత్యలకు సంబంధించి ప్రత్యేక చట్టాలు తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇప్పటికే కోరాయి. ఈ క్రమంలో టీవీకే సుప్రీంను ఆశ్రయించింది. ప్రస్తుతం సీబీసీఐడీ పోలీసులు ఈ కేసు దర్యాప్తు
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ