పరవళ్లు తొక్కుతున్న మూసీ.. రాకపోకలకు అంతరాయం
యాదాద్రి భువనగిరి, 29 ఆగస్టు (హి.స.) ఎగువ ప్రాంతాలలో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాల కారణంగా యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి లో వరద నీరు ఉదృతంగా రావడంతో శుక్రవారం మూసీనది పరవళ్ళు తొక్కుతుంది. భూదాన్ పోచంపల్లి మండల పరిధిలోని జూలూరు - రుద్ర
మూసీ నది పరవళ్ళు


యాదాద్రి భువనగిరి, 29 ఆగస్టు (హి.స.)

ఎగువ ప్రాంతాలలో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాల కారణంగా యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి లో వరద నీరు ఉదృతంగా రావడంతో శుక్రవారం మూసీనది పరవళ్ళు తొక్కుతుంది. భూదాన్ పోచంపల్లి మండల పరిధిలోని జూలూరు - రుద్రెల్లి గ్రామాల మధ్య గల బ్రిడ్జి మీద నీరు ప్రవహించడంతో ఇరు గ్రామాల మధ్య రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పోచంపల్లి నుండి బీబీనగర్ వెళ్లేందుకు ఇదే ప్రధాన రహదారి. అయితే ఈ బ్రిడ్జిపై మూసి నీరు పారుతుండడంతో బీబీనగర్, భువనగిరి వెళ్లాలంటే పెద్దరావులపల్లి, బట్టుగూడెం మీదుగా సుమారు 20 కిలోమీటర్లు తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. బ్రిడ్జి వద్దకు పోలీసు అధికారులు చేరుకొని బారికేడ్లను ఏర్పాటు చేసి రాకపోకలను నిలిపివేశారు. మూసి పరివాహక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, గొర్రెలు, పశువుల కాపరులు మూసీ నది వైపు వెళ్ళద్దని హెచ్చరికలు జారీ చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande