చదువుతో పాటు క్రీడల్లోను రాణించాలి : కలెక్టర్ జీతేశ్ వి పాటిల్
భద్రాద్రి కొత్తగూడెం, 29 ఆగస్టు (హి.స.) చదువుతో పాటు క్రీడలు కూడా విద్యార్థులకు ఎంతో అవసరమని, క్రీడలను కెరీర్గా ఎంచుకొని దేశానికి పేరు తెచ్చిన క్రీడాకారులు ఎంతో మంది ఉన్నారని జిల్లా కలెక్టర్ జీతేశ్ వి పాటిల్ అన్నారు. హాకీ మాంత్రికుడు, మేజర్ ధ్యాన్
భద్రాద్రి కలెక్టర్


భద్రాద్రి కొత్తగూడెం, 29 ఆగస్టు (హి.స.)

చదువుతో పాటు క్రీడలు కూడా విద్యార్థులకు ఎంతో అవసరమని, క్రీడలను కెరీర్గా ఎంచుకొని దేశానికి పేరు తెచ్చిన క్రీడాకారులు ఎంతో మంది ఉన్నారని జిల్లా కలెక్టర్ జీతేశ్ వి పాటిల్ అన్నారు. హాకీ మాంత్రికుడు, మేజర్ ధ్యాన్ చంద్ జయంతి సందర్భంగా యువజన, క్రీడల శాఖ ఆధ్వర్యంలో క్రీడా పోటీలను నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి శుక్రవారం పట్టణంలోని సింగరేణి స్టేడియంలో కలెక్టర్ విజేతలకు బహుమతులను అందజేసి మాట్లాడారు.

ప్రతి రోజు క్రీడల్లో సాధన చేస్తే ఏదో ఒక రోజు అద్భుతమైన విజయాలను సొంతం చేసుకోవచ్చని, సాధన చేయడం ద్వారానే ఇది సాధ్యమవుతుందన్నారు.

తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను ప్రోత్సహించాలని సూచించారు. క్రీడలను విజయవంతంగా నిర్వహించిన కోచ్ లను కలెక్టర్ అభినందించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్


 rajesh pande