అమరావతి, 29 ఆగస్టు (హి.స.)సీనియర్ ఎన్టీఆర్ కుమారుడు, కల్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్‌ల తండ్రి, నందమూరి హరికృష్ణ ఏడేళ్ల క్రితం రోడ్డుప్రమాదంలో మరణించారు. నార్కట్ పల్లివద్ద జరిగిన కారు ప్రమాదంలో ఆయన స్వర్గస్తులయ్యారు.
నేడు ఆయన ఏడవ వర్థంతి సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నివాళులు అర్పిస్తూ ఎక్స్ లో పోస్ట్ చేశారు.
తమది కేవలం బంధుత్వం మాత్రమే కాదని, అంతకంటే ఎక్కువ ఆత్మీయతను, స్నేహాన్ని పంచుకున్నామన్నారు. కుటుంబ సభ్యులకే కాకుండా.. పార్టీ కార్యకర్తలకు, ప్రజలకు, అభిమానులకు కూడా ఆత్మీయతను పంచిన మంచి మనిషి హరికృష్ణ అని చంద్రబాబు కొనియాడారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి