జపాన్‌లో ప్రధాని మోదీకి నీరాజనం.. మా కల నిజమైందన్న ప్రవాస భారతీయులు
టోక్యో, 29 ఆగస్టు (హి.స.)భారత ప్రధాని నరేంద్ర మోదీకి జపాన్‌లో అపూర్వమైన, భావోద్వేగపూరిత స్వాగతం లభించింది. 15వ భారత్-జపాన్ వార్షిక సదస్సులో పాల్గొనేందుకు శుక్రవారం టోక్యోకు చేరుకున్న ఆయనను చూసి అక్కడి ప్రవాస భారతీయులు ఆనందంతో ఉప్పొంగిపోయారు. తమ అభిమా
పిెం


టోక్యో, 29 ఆగస్టు (హి.స.)భారత ప్రధాని నరేంద్ర మోదీకి జపాన్‌లో అపూర్వమైన, భావోద్వేగపూరిత స్వాగతం లభించింది. 15వ భారత్-జపాన్ వార్షిక సదస్సులో పాల్గొనేందుకు శుక్రవారం టోక్యోకు చేరుకున్న ఆయనను చూసి అక్కడి ప్రవాస భారతీయులు ఆనందంతో ఉప్పొంగిపోయారు. తమ అభిమాన నేతను ప్రత్యక్షంగా చూడటంతో వారి సంతోషానికి అవధుల్లేకుండా పోయాయి.

భారత్-జపాన్ మధ్య ప్రత్యేక వ్యూహాత్మక, ప్రపంచ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే లక్ష్యంతో ప్రధాని మోదీ ఆగస్టు 29, 30 తేదీల్లో జపాన్‌లో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన జపాన్ ప్రధాని షిగెరు ఇషిబాతో ఉన్నతస్థాయి చర్చలు జరపనున్నారు. అయితే, ఆయన రాక సందర్భంగా టోక్యో విమానాశ్రయంలో ప్రవాస భారతీయులు పెద్ద సంఖ్యలో గుమికూడి, సంప్రదాయ ప్రదర్శనలతో దేశభక్తిని చాటుకున్నారు.

ఈ సందర్భంగా పలువురు ప్రవాసులు తమ ఆనందాన్ని పంచుకున్నారు. ఈ క్షణం మా అందరికీ ఎంత భావోద్వేగమైనదో మాటల్లో చెప్పలేను. ఆయన్ను టీవీలో చూశాం, ఇంటర్వ్యూలు విన్నాం. కానీ, ప్రత్యక్షంగా చూడటం అనేది ఒక భిన్నమైన అనుభూతి, ఒక కొత్త శక్తినిచ్చింది అని ఓ ప్ర‌వాస భార‌తీయుడు ఉద్వేగంగా తెలిపారు. ప్రధాని మోదీని ఇక్కడ కలవడంతో ప్రతీ భారతీయుడికి ఒక కల నిజమైనట్లే అని మరొకరు తన సంతోషాన్ని వ్యక్తం చేశారు.

మరో ప్రవాస భారతీయుడు స్పందిస్తూ, ఆయనే అత్యుత్తమ ప్రధాని. పదేళ్ల క్రితం మోదీ లేనప్పుడు పాకిస్థాన్ అంటే ప్రమాదకరంగా అనిపించేది. ఇప్పుడు ఆయన నాయకత్వంలో అమెరికా కూడా ఓ జోక్‌లా కనిపిస్తోంది అని అన్నారు. ప్రధానికి స్వాగతం పలికిన జపాన్ కళాకారులు సైతం ఆయనతో సంభాషించిన తర్వాత తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. మోదీ గారు మాతో కలిసి ఫొటో దిగుతారని అస్సలు ఊహించలేదు. ఇది నన్ను చాలా కదిలించింది అని ఓ జపాన్ కళాకారిణి వ్యాఖ్యానించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande