అమరావతి, 29 ఆగస్టు (హి.స.)ఏపీలో అభివృద్ధి కేంద్రీకరణ తమ లక్ష్యం అని మంత్రి నారా లోకేష్ అన్నారు. ఏపీకి ఏకైక రాజధాని గా అమరావతి ఉంటుందన్నారు.. కాకపోతే అభివృద్ధి వికేంద్రీకరణ జరుగుతుందని తెలిపారు. వైజాగ్ కన్వెన్షన్ లో ఐసిఏఐ నేషనల్ కాన్ఫరెన్స్ లో ఆయన మాట్లాడారు. పారిశ్రామిక విప్లవం వచ్చిన ప్రతిసారి ఉద్యోగాలు పెరుగుతాయి అన్నారు. మన ముందు ఏఐ ఒక అవకాశం గా ఉందని తెలిపారు. తమ ప్రభుత్వం స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పై దృష్టి పెట్టిందన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద డేటా సెంటర్ విశాఖలో ఏర్పాటు కాబోతుందని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ కి చెందిన యువత దేశానికి కాదు ప్రపంచానికే సేవలందించాలని కోరారు. ఏపీని 2047 కల్లా 2.4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థకు చేర్చడమే లక్ష్యం అన్నారు. దేశంలో ఉత్పత్తి అవుతున్న ఏసీల్లో 50% ఏపీ నుంచి తయారవుతున్నాయని గుర్తు చేశారు. ప్రకాశం జిల్లాను కంప్రెస్ బయోగ్యాస్ క్యాపిటల్గా తయారు చేస్తామని తెలిపారు. అనంతపురం జిల్లాను ఆటోమోటివ్ క్యాపిటల్ గా తయారు చేస్తామన్నారు. కర్నూలు జిల్లాను పునరుత్పాదక విద్యుత్తు ఉత్పత్తిలో క్యాపిటల్ గా మారుస్తామని తెలిపారు. ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ సంస్థలను కడప చిత్తూరులో ఏర్పాటు చేస్తున్నామని అన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి