విశాఖ పట్టం, 29 ఆగస్టు (హి.స.)విశాఖ రుషికొండ భవనాన్ని ఉప ముఖ్యమంత్రి పవన్కల్యాణ్పరిశీలించారు. ఆయన వెంట మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ ఉన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రకృతితో పెట్టుకుంటే ఉన్నది పోద్ది ఇదే నిదర్శనం అన్నారు. సంవత్సరానికి 7 కోట్లు రాష్ట్రానికి ఆదాయం వచ్చే రుషికొండపై కోటి రూపాయలు కేవలం కరెంటుకే వెచ్చించే స్థితికి తెచ్చారని ఆయన పేర్కొన్నారు. ఈ ప్యాలెస్ నిర్మాణంలో అవకతవకలు జరిగాయని తెలుగుదేశం, జనసేన పార్టీలు గతంలో ఆరోపణలు చేశాయి. ఈ పర్యటన ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. భవనంలోని బెడ్‌రూమ్స్, బాత్‌రూమ్‌లను ఆయన పరిశీలించారు.
గతంలో హరిత రిసార్ట్స్ ఉన్నప్పుడు రూ.7 కోట్ల ఆదాయం వచ్చేదని మంత్రి దుర్గేష్ తెలిపారు. నిర్వహణ కింద రూ.కోటి బకాయిలున్నాయన్నారు. ఎన్జీటీలో కేసు నడుస్తుందని అధికారులు తెలిపారు. రుషికొండ భవనంపై అసెంబ్లీలో చర్చ జరగాలని పవన్ సూచించారు. రుషికొండ ద్వారా ప్రభుత్వానికి ఆదాయం వచ్చేలా పరిశీలించాలన్నారు. ప్యాలెస్‌ను అలాగే వదిలేస్తే పాడైపోతుందన్నారు. సాధ్యమైనంత త్వరగా దీనిని వినియోగం లోకి తీసుకు వస్తామన్నారు. నిర్మాణం పూర్తయింది కనుక దీనిని వినియోగిస్తే మంచిదన్నారు. రూ.450 కోట్లు దీనికి వెచ్చించారు.. దానికి తగినట్లుగా వచ్చే ఆదాయ మార్గాన్ని వెతకాలన్నారు. దీని ద్వారా టూరిజానికి ఆదాయం రావాలని తలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి