ఫ్లాట్‌గా దేశీయ మార్కెట్ సూచీలు
ముంబయి,29 ఆగస్టు (హి.స.) ట్రంప్ టారిఫ్‌లతో వరుస నష్టాలను చవిచూసిన దేశీయ మార్కెట్‌ సూచీలు నేటి ట్రేడింగ్‌లో ఊగిసలాడుతున్నాయి (Stock Market Today). అంతర్జాతీయ మార్కెట్లలోని మిశ్రమ సంకేతాల నడుమ ఫ్లాట్‌గా కదలాడుతున్నాయి. ఉదయం 9.39 గంటల సమయంలో సెన్సెక్స్‌
Bombay Stock Exchange


ముంబయి,29 ఆగస్టు (హి.స.) ట్రంప్ టారిఫ్‌లతో వరుస నష్టాలను చవిచూసిన దేశీయ మార్కెట్‌ సూచీలు నేటి ట్రేడింగ్‌లో ఊగిసలాడుతున్నాయి (Stock Market Today). అంతర్జాతీయ మార్కెట్లలోని మిశ్రమ సంకేతాల నడుమ ఫ్లాట్‌గా కదలాడుతున్నాయి. ఉదయం 9.39 గంటల సమయంలో సెన్సెక్స్‌ 64 పాయింట్లు లాభంతో 80,148 వద్ద ఉండగా.. నిఫ్టీ 18 పాయింట్ల లాభంతో 24,519గా ఉంది.

నిఫ్టీ సూచీలో హెచ్‌యూఎల్‌, ఆసియన్ పెయింట్స్‌, ట్రెంట్‌, కొటక్ మహీంద్రా, టాటా కన్జూమర్‌ ప్రొడక్ట్స్‌ షేర్లు లాభాల్లో ఉన్నాయి. ఎన్‌టీపీసీ, టైటాన్ కంపెనీ, ఓఎన్‌జీసీ, ఎస్‌బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, టాటా మోటార్స్ స్టాక్స్‌ నష్టాల్లో కదలాడుతున్నాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 87.69 వద్ద ఉంది. గురువారం సాయంత్రం అమెరికా మార్కెట్లు లాభాల్లో ముగియగా.. నేటి ట్రేడింగ్‌లో జపాన్‌ నిక్కీ మినహా మిగిలిన ఆసియా మార్కెట్లు అదే బాటలో పయనిస్తున్నాయి. దేశంలోనే అతిపెద్ద వ్యాపార సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్‌.. వార్షిక సాధారణ సమావేశం (AGM) నేపథ్యంలో ఆ సంస్థ షేర్లు దూసుకెళ్తున్నాయి. 48వ ఏజీఎం శుక్రవారం (ఆగస్టు 29) మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభం కానుంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande