అమరావతి, 3 ఆగస్టు (హి.స.)
జగ్గయ్యపేట నియోజకవర్గంలో డిఫెన్స్ క్లస్టర్లో పరిశ్రమల ఏర్పాటుకు అడుగులు పడుతున్నాయి. ఇటీవల బ్రహ్మోస్ క్షిపణుల తయారీ సంస్థ ప్రతినిధులు ఈ ప్రాంతాన్ని పరిశీలించారు. బ్రహ్మోస్ ఏరోస్పేస్ డిఫెన్స్ కార్పొరేషన్ సీఎండీ ఆధ్వర్యంలోని బృందం వచ్చింది. కొద్దికాలం కిందట తొలిసారి ఈ బృందం జగ్గయ్యపేటలో పర్యటించింది. తాజాగా రెండోసారి వచ్చి వెళ్లారు. దీంతో బ్రహ్మోస్ క్షిపణుల తయారీ యూనిట్‌ను ఇక్కడ నెలకొల్పేందుకు మార్గం సుగమమైందని తెలుస్తోంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ