హైదరాబాద్, 30 ఆగస్టు (హి.స.)
యూరియా కొరత తీర్చాలని, ఈ అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కమిషనరు బీఆర్ఎస్ నేతలు సూచించారు. మేం రాజకీయాలు చేయడం లేదు.. రైతుల తరపున మాట్లాడుతున్నాం అని కమిషనర్కు బీఆర్ఎస్ నేతలు స్పష్టం చేశారు. యూరియా సంక్షోభానికి కారణం కాంగ్రెస్ పార్టీ అంటూ నినాదాలు చేశారు. పండగపూట కూడా రైతన్నలను రోడ్లపై నిలబెట్టింది ఈ ప్రభుత్వం అని ధ్వజమెత్తారు. గణపతి బప్పా మోరియా - కావాలయ్యా యూరియా” అంటూ నినదించారు. రైతన్నలకు ఎరువులు సరఫరా చేయలేని కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే దిగిపోవాలని నినాదాలు చేశారు. రైతన్నలకు యూరియా వెంటనే సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. “రేవంత్ దోషం రైతన్నకు మోసం” అంటూ నినాదాలు చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. ---------------
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్