హైదరాబాద్, 30 ఆగస్టు (హి.స.)
రాష్ట్రంలో యూరియా కొరత తీర్చాలంటూ అన్నదాతల తరపున వ్యవసాయ శాఖ కమిషనర్ కార్యాలయం వద్ద శాంతియుతంగా ధర్నా చేస్తున్న బీఆర్ఎస్ నేతలను పోలీసులు అరెస్టు చేసిన చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా పోలీసు ఉన్నతాధికారులను హరీశ్రావు సూటిగా ప్రశ్నించారు.
అరెస్ట్ చేయడానికి వచ్చిన పోలీసులను జీతాలు పెరిగాయా? వాహనాల్లో కొట్టిస్తున్న పెట్రోల్ డబ్బులు ఇస్తున్నారా? టీఏ, డీఏలు వచ్చాయా అంటూ హరీశ్రావు ప్రశ్నించారు. ప్రతి నెల ప్రత్యేక అలవెన్స్ ఇస్తున్నారా..? మీకు పెట్రోల్ బిల్లు వస్తుందా..? పంపోడు మీకు ఉద్దెర పోస్తలేడు. పోలీసు జీపులకు పెట్రోల్ పోయించుకునేందుకు రేవంత్ రెడ్డి పైసలు ఇస్తలేడు. మీ సొంతం పైసలతోటి పెట్రోల్ పోయించుకుంటున్నరు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..