ప్రెజెంటేషన్ ఇస్తామంటే భయం ఎందుకు? మంత్రి శ్రీధర్ బాబు కు హరీశ్ రావు కౌంటర్
హైదరాబాద్, 30 ఆగస్టు (హి.స.) అసెంబ్లీ సమావేశాల్లో కాలేశ్వరం ప్రాజెక్టు వివాదం అంశంపై పవర్పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడానికి అవకాశం ఇవ్వాలని బీఆర్ఎస్ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. కానీ దీనిపై రేవంత్ సర్కార్ అనుమతి ఇవ్వడం లేదు. ఈ నేపథ్యంలోనే శనివారం శాసనసభస
హరీష్ రావు కౌంటర్


హైదరాబాద్, 30 ఆగస్టు (హి.స.)

అసెంబ్లీ సమావేశాల్లో కాలేశ్వరం ప్రాజెక్టు వివాదం అంశంపై పవర్పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడానికి అవకాశం ఇవ్వాలని బీఆర్ఎస్ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. కానీ దీనిపై రేవంత్ సర్కార్ అనుమతి ఇవ్వడం లేదు. ఈ నేపథ్యంలోనే శనివారం శాసనసభసమావేశాల నేపథ్యంలో అసెంబ్లీ లాబీలో మాజీ మంత్రి హరీశ్రావు మీడియా చిట్చాట్లో శ్రీధర్ బాబుకు కౌంటర్ ఇచ్చారు. మేము కాళేశ్వరం ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తామంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి భయం ఎందుకు? అని ప్రశ్నించారు. వాస్తవాలు ప్రజలకు వివరిస్తాం కదా.. ప్రజలకు వాస్తవాలు తెలుస్తాయనే పవర్పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వడానికి అనుమతి ఇవ్వడం లేదని ఆరోపించారు.

కాగా, కాళేశ్వరం ప్రాజెక్టు పీపీటీ అంశంపై శాసనసభవ్యవహారాల ఇంఛార్జి, మంత్రి శ్రీధర్ బాబు అసెంబ్లీ లాబీలో మీడియాతో మాట్లాడారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande