హైదరాబాద్, 30 ఆగస్టు (హి.స.) దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కు సంతాప సందేశంగా కేటీఆర్ మాట్లాడుతూ..
విద్యార్థి దశ నుంచి క్రియాశీలంగా రాజకీయాల్లో ఉన్నారు గోపీనాథ్. ఒక పార్టీని, నాయకుడిని నమ్ముకుంటే.. ఎన్టీఆర్ నాయకత్వంలో.. కేసీఆర్ నాయకత్వంలో కష్టమొచ్చినా నష్టమొచ్చినా పని చేశారు. ఎమ్మెల్యేగా సేవలందించారు. హ్యాట్రిక్ కొట్టడం ఎమ్మెల్యేలకు అంత సులువు కాదు. అది గోపీనాథ్కు సాధ్యమైంది. మాదాపూర్ ఏరియాలో చాలా చిన్న ఇంట్లో గోపీనాథ్ నివాసం ఉన్నారు. గోపీనాథ్ ఎప్పుడూ కూడా గుమ్మనంగా ఉండేవారు. ముగ్గురు పిల్లలు 21 ఏండ్ల లోపే. ఎవరూ సెటిల్ కాలేదు పెళ్లిల్లు కాలేదు. ఆయన ఇల్లు చూసి బాధపడ్డాం. బతుకమ్మ చీరలను ప్రారంభించే కంటే ముందు.. తన నియోజకవర్గంలో బతుకమ్మ పండుగకు చీర పెట్టే సంస్కృతి తీసుకొచ్చారు. గోపీనాథ్. నియోజకవర్గంలో గోపన్న అని పిలుచుకుంటారు. ప్రజలతో నిత్యం మమేకమయ్యేవారు గోపీనాథ్ అని కేటీఆర్ గుర్తు చేశారు.
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్