హైదరాబాద్, 30 ఆగస్టు (హి.స.)
కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇవాళ సభ ప్రారంభం కాబట్టి అసెంబ్లీకి వచ్చానని.. రేపటి నుంచి రానని తెలిపారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా తన అనుచరులు, మద్దతుదారులతో కలిసి హైదరాబాద్కు వచ్చిన ఆయన.. గన్పార్క్ వద్దకు చేరుకుని అమరవీరులకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి మాట్లాడుతూ... ప్రజలు వరద కష్టాల్లో ఉన్నారని.. వారికి అండగా ఉండాల్సిన సమయం ఆసన్నమైందని తెలిపారు. వరద సమయంలో మనం ఉండాల్సింది ప్రజల్లో కానీ అసెంబ్లీలో కాదని వ్యాఖ్యానించారు. ఈ సమయంలో ప్రజల్లో ఉండి, వారి కష్టాలు తీర్చడమే తన లక్ష్యమని చెప్పారు.
మరోవైపు అసెంబ్లీ వద్ద కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అనుచరులు బల ప్రదర్శనకు దిగారు. తమ నాయకుడికి మంత్రి పదవి ఇవ్వాలంటూ నిరసనకు దిగారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..