హైదరాబాద్, 30 ఆగస్టు (హి.స.)
గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీల విషయంలో తెలంగాణ కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఎమ్మెల్సీలుగా ప్రొఫెసర్ కోదండరాం, అజారుద్దీన్ పేర్లను ఖరారు చేసింది. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ఎన్నికైన ప్రొ. కోదండరాం, జర్నలిస్ట్ అమీర్ అలీఖాన్ ల నియామకాన్ని ఇటీవల సుప్రీంకోర్టు రద్దు చేసింది. ఈ నేపథ్యంలో ఇవాళ జరిగిన కేబినెట్ భేటీలో ఇదో కోటాలో తిరిగి కోదండరాంతో పాటు అజారుద్దీన్ పేరును కేబినెట్ ఖరారు చేసింది. జూబ్లీహిల్స్ బై పోల్ లో కాంగ్రెస్ తరఫున టికెట్ ఆశిస్తున్న అజారుద్దీన్ పేరును అనూహ్యంగా ఎమ్మెల్సీగా ప్రకటించడంతో జూబ్లీహిల్స్ టికెట్ ఎవరికి ఇవ్వబోతున్నారు అనేది ఉత్కంఠగా మారింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..