మిథున్ రెడ్డి.బెయిల్ పిటిషన్.వచ్చేనెల రెండో తేదీకి వాయిదా
విజయవాడ 30 ఆగస్టు (హి.స.) , :ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించేందుకు మధ్యంతర బెయిల్‌, మద్యం కేసులో రెగ్యులర్‌ బెయిల్‌ ఇప్పించాలని ఎంపీ మిథున్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ వచ్చే నెల రెండో తేదీకి వాయిదా పడింది. అదేవిధంగా కె.ధనుంజయ
మిథున్ రెడ్డి.బెయిల్ పిటిషన్.వచ్చేనెల రెండో తేదీకి వాయిదా


విజయవాడ 30 ఆగస్టు (హి.స.)

, :ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించేందుకు మధ్యంతర బెయిల్‌, మద్యం కేసులో రెగ్యులర్‌ బెయిల్‌ ఇప్పించాలని ఎంపీ మిథున్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ వచ్చే నెల రెండో తేదీకి వాయిదా పడింది. అదేవిధంగా కె.ధనుంజయ్‌రెడ్డి, పి.కృష్ణమోహన్‌రెడ్డి, బాలాజీ గోవిందప్ప, చెరుకూరి వెంకటేష్‌ నాయుడు దాఖలు చేసిన డీఫాల్ట్‌ బెయిల్‌పై విచారణ కూడా 2వ తేదీకి వాయిదా వేసింది. కాగా, మద్యం కుంభకోణంలో రిమాండ్‌ ఖైదీగా ఉన్న పైలా దిలీప్‌కు బెయిల్‌ మంజూరు కావడంతో విజయవాడ జిల్లా జైలు నుంచి శుక్రవారం విడుదలయ్యాడు. దిలీప్‌ సతీమణి కోర్టుకు శుక్రవారం పూచీకత్తులను సమర్పించారు. సిట్‌ అధికారులు తన తల్లిని బెదిరిస్తున్నారని లీప్‌ ఏసీబీ కోర్టులో శుక్రవారం పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై కౌంటర్‌ దాఖలు చేయాలని సిట్‌ అధికారులను ఆదేశిస్తూ విచారణను మూడో తేదీకి కోర్టు వాయిదా వేసింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande