హైదరాబాద్, 30 ఆగస్టు (హి.స.)
అల్వాల్ ప్రభుత్వ ప్రాథమిక
ఆరోగ్య కేంద్రం ఆసుపత్రి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శ్వేత పై వేటు పడింది. సెలవు తీసుకోకుండానే విధులకు డుమ్మా కొడుతున్న డాక్టర్ను సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ మను చౌదరి ఆదేశాల మేరకు జిల్లా వైద్యారోగ్య అధికారి డాక్టర్ ఉమా గౌరీ ఉత్తర్వులు జారీ చేశారు. డాక్టర్ శ్వేత ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండానే విధులకు గైర్హాజరు అవుతుందని ఫిర్యాదులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ మిక్కిలినేని మనుచౌదరి, డీఎం అండ్ హెచ్ వో డాక్టర్ ఉమా గారితో కలిసి ఈ నెల 26వ తేదీన అకస్మికంగా తనిఖీ చేశారు. కలెక్టర్ తనిఖీ చేసిన సమయంలో డాక్టర్ శ్వేత విధుల్లో లేకపోవడాన్ని సీరియస్ తీసుకున్నారు. అక్కడి స్టాపును కలెక్టర్ ఆరా తీయగా, ఎలాంటి సిక్ లీవ్ పెట్టకుండానే విధులకు డుమ్మా కొట్టినట్లు నిర్ధారించుకున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..