హైదరాబాద్, 30 ఆగస్టు (హి.స.)
దివంగత హాస్యనటుడు అల్లు రామలింగయ్య సతీమణి, అగ్ర నిర్మాత అల్లు అరవింద్ తల్లి అల్లు కనకరత్నం (94) కన్నుమూసిన విషయం తెలిసిందే. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆమె శనివారం తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. ఈ వార్తతో అల్లు, మెగా కుటుంబాలలో విషాదం నెలకొంది. అయితే అల్లు కనకరత్నం అంత్యక్రియలు శనివారం మధ్యాహ్నం కోకాపేటలో జరుగగా.. ఈ అంత్యక్రియల్లో అల్లు కుటుంబ సభ్యులు అల్లు అరవింద్, అల్లు అర్జున్, మెగా కుటుంబ సభ్యులు చిరంజీవి, రామ్ చరణ్ తదితరులు పాల్గోన్నారు. అంతకుముందు అంత్యక్రియల్లో భాగంగా అరవింద్ కుండని పట్టుకోగా.. చిరంజీవితో పాటు అల్లు అర్జున్, రామ్ చరణ్, అల్లు అర్జున్ కొడుకు అయాన్ కనకరత్నం పాడేను మోశారు.
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్