తప్పులు చేసి పవర్పాయింట్ ప్రజెంటేషన్ ఎందుకు? మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
హైదరాబాద్, 30 ఆగస్టు (హి.స.) అసెంబ్లీలో కాలేశ్వరం ప్రాజెక్ట్ అంశంపై బీఆర్ఎస్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ గురించి శాసనసభ వ్యవహారాల ఇంఛార్జి, మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్ ఇచ్చారు. శనివారం మొదటి రోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. సమావేశాలకు ముందు మం
మంత్రి శ్రీధర్ బాబు


హైదరాబాద్, 30 ఆగస్టు (హి.స.) అసెంబ్లీలో కాలేశ్వరం ప్రాజెక్ట్ అంశంపై బీఆర్ఎస్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ గురించి శాసనసభ వ్యవహారాల ఇంఛార్జి, మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్ ఇచ్చారు. శనివారం మొదటి రోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. సమావేశాలకు ముందు మంత్రి శ్రీధర్ బాబు అసెంబ్లీ లాబీలో మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో తప్పులు చేసింది వాళ్ళు.. మళ్ళీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఎందుకు? అని బీఆర్ఎస్ నేతలను ప్రశ్నించారు. ఏమైనా ఒప్పులు చేస్తే అవకాశం ఉండేది.. సభలో ఎవరికైనా ఆర్డర్ ప్రకారం మాట్లాడడానికి అవకాశం ఇస్తామని ఆయన స్పష్టం చేశారు.

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande