హైదరాబాద్, 30 ఆగస్టు (హి.స.)
బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ మాజీ
సీఎం కేసీఆర్ పై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రేపటి నుంచి అసెంబ్లీలో కాళేశ్వరం కమిషన్ నివేదికపై చర్చ జరుగుతుందని అన్నారు. కేసీఆర్ అసెంబ్లీకి రావాలని సూచించారు. అసెంబ్లీకి కేసీఆర్ రాకపోతే కాళేశ్వరంలో జరిగిన తప్పును ఒప్పుకున్నట్లే అని చెప్పారు. అసెంబ్లీకి రావాల్సిందే.. తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాల్సిందే అని అన్నారు. తప్పు జరిగింది కాబట్టే కేసీఆర్ భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. అందుకే కోర్టుకు కూడా వెళ్లారని అన్నారు.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..