హైదరాబాద్, 30 ఆగస్టు (హి.స.)
రాష్ట్రంలో యూరియా కొరతపై
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సెక్రటేరియట్ ఎదుట ఆందోళన చేపట్టగా.. పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ నిరసనపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు ఘాటు వ్యాఖ్యలు చేశారు. యూరియాపై బీఆర్ఎస్ నేతలది కపట నాటకమని మండిపడ్డారు. రాష్ట్రంలో యూరియా కొరతకు కేంద్రం కారణమని తెలియదా అని ప్రశ్నించారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేయడం ఏంటని ప్రశ్నించారు. బీఆర్ఎస్ నాటకలను ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో నమ్మరని మంత్రి తుమ్మల అన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..