గుంటూరు, 30 ఆగస్టు (హి.స.)రైళ్లలోని జనరల్ బోగీల్లో ప్రయాణించే వారికి స్టేషన్ కౌంటర్లలోని వరుసల్లో నిల్చోవాల్సిన ఇబ్బంది లేకుండా జనరల్ టికెట్ల జారీ సులభతరం కానుంది. రాయ్‌పుర్ రైల్వే స్టేషన్‌లో ప్రయోగాత్మకంగా టీటీఈలు, టికెట్ తనిఖీ బృందం ప్రయాణికులకు నేరుగా మొబైల్ టికెట్లు జారీ చేసే ప్రక్రియను ప్రారంభించింది. అర చేతిలో ఇమిడి ఉండే పరికరం సాయంతో ప్రయాణికులు ఎంతమంది, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్లాలన్న వివరాలు నమోదు చేస్తున్నారు. అనంతరం టీటీఈలకు అందజేసిన ప్రింటర్ల ద్వారా టికెట్లు జారీ చేస్తున్నారు. ఈ నూతన విధానాన్ని దేశ వ్యాప్తంగా అన్ని మేజర్ స్టేషన్లలో ప్రవేశపెట్టేందుకు రైల్వే అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ