మహబూబ్నగర్, 30 ఆగస్టు (హి.స.)
యూరియా కోసం ఆందోళన చేస్తున్న రైతులలో ఒక రైతు పై ఎస్సై చేయి చేసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో రైతు పై చేయి చేసుకున్న మరికల్ ఎస్సై రాము పై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని నారాయణపేట ఎస్పీ యోగేష్ గౌతమ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మరికల్ మండలం తీలేరు గ్రామంలో వ్యవసాయ సహకార సంఘం వద్ద రైతులు క్యూలైన్ లో యూరియా ఇవ్వాలి అని ఆందోళన చేస్తున్న రైతులను.. క్యూ లైన్ లో ఉండి యూరియా తీసుకోవాలని దురుసుగా ప్రవర్తించి, ఓ రైతు పై చేయి చేసుకున్న వీడియో వైరల్ అవుతోంది. ఈ అంశం పై ఎస్పీ స్పందించారు. సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు సేకరించిన అనంతరం మరికల్ ఎస్సై పై చర్యలు ఉంటాయి అని ఎస్పీ పేర్కొన్నారు. యూరియా కోసం వచ్చే రైతుల వద్ద సహనంతో మెలుగుతూ వారికి నచ్చజెప్పాలని పోలీస్ యంత్రాంగానికి ఎస్పీ సూచనలు చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు