వరద ఉద్ధృతిపై ప్రాజెక్టు అధికారులతో నిజామాబాద్ జిల్లా కలెక్టర్ సమీక్ష
నిజామాబాద్, 30 ఆగస్టు (హి.స.) నిజామాబాద్ జిల్లా మెండోరా మండలం పోచంపాడ్లో గల శ్రీరాంసాగర్ రిజర్వాయర్ ను శనివారం జిల్లా కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి సందర్శించారు. ఏకధాటిగా కురుస్తున్న భారీ వర్షాలకు పెద్ద ఎత్తున ప్రాజెక్టులోకి వచ్చి చేరుతున్న వరద ప్
నిజామాబాద్ కలెక్టర్


నిజామాబాద్, 30 ఆగస్టు (హి.స.)

నిజామాబాద్ జిల్లా మెండోరా మండలం పోచంపాడ్లో గల శ్రీరాంసాగర్ రిజర్వాయర్ ను శనివారం జిల్లా కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి సందర్శించారు. ఏకధాటిగా కురుస్తున్న భారీ వర్షాలకు పెద్ద ఎత్తున ప్రాజెక్టులోకి వచ్చి చేరుతున్న వరద ప్రవాహాన్ని పరిశీలించారు. రిజర్వాయర్లో నీటిమట్టాన్ని పరిశీలించి ప్రాజెక్టు కు అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎగువన గల గైక్వాడ్, విష్ణుపురి ప్రాజెక్టులు, బాలేగాం, బాబ్లీ బ్యారేజీలతో పాటు నిజాంసాగర్, గడ్డెన్నవాగు, కౌలాస్ నాల, లెండి ప్రాజెక్టుల మిగులు గోదావరి, మంజీర ద్వారా వచ్చి చేరుతుండటంతో ఎస్సారెస్పీకి వరద ప్రవాహం పోటెత్తుతోందని అన్నారు. ఎస్సారెస్పీ బ్యాక్ వాటర్ ఏరియాలతో పాటు దిగువన గల లోతట్టు గ్రామాల పరిస్థితి గురించి కలెక్టర్ ఆరా తీశారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande