అమరావతి, 30 ఆగస్టు (హి.స.):ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు జిల్లాలు జలమయం అయ్యాయి. ఇప్పటికీ లోతట్టు ప్రాంతాల ప్రజలు.. జలదిగ్బంధంలో ఉన్నారు. వర్షాల ధాటికి ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావాలంటే.. భయపడుతున్నారు. అయితే వర్ష బీభత్సానికి రహదారులు కొట్టుకుపోయాయి. వాగులు, నదులు, చెరవులు పొంగిపొర్లుతున్నాయి. ప్రాజెక్టులకు భారీగా వరద ప్రవహిస్తుంది. ఈ క్రమంలో అధికారులు సహాయక చర్యలు చేపడుతూ.. హెచ్చరికలు జారీ చేస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ