తెలంగాణ అసెంబ్లీ రేపటికి వాయిదా..
హైదరాబాద్, 30 ఆగస్టు (హి.స.) తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రేపటికి వాయిదా పడ్డాయి. జూబ్లీహిల్స్ దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతికి శాసనసభ సంతాపం ప్రకటించింది. గోపీనాథ్ మృతిపట్ల సీఎం రేవంత్ రెడ్డి సభలో సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అనంతరం మంత్
అసెంబ్లీ వాయిదా


హైదరాబాద్, 30 ఆగస్టు (హి.స.)

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రేపటికి వాయిదా పడ్డాయి. జూబ్లీహిల్స్ దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతికి శాసనసభ సంతాపం ప్రకటించింది. గోపీనాథ్ మృతిపట్ల సీఎం రేవంత్ రెడ్డి సభలో సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అనంతరం మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వర్ రావు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేటీఆర్, వేముల ప్రశాంత్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, కేపీ వివేకానంద, ముఠా గోపాల్, కాలేరు వెంకటేశ్, సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు.. గోపీనాథ్ మృతికి సంతాపం ప్రకటిస్తూ తీర్మానాన్ని బలపరిచారు. అనంతరం రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. ఆ తర్వాత సభను ఆదివారం(మార్చి 31) ఉదయం 9 గంటలకు వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రకటించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్


 rajesh pande