తాడిపత్రి.వెళ్లేందుకు వైసిపి మాజీ.ఎమ్మెల్యే కేతి రెడ్డి పెద్దా రెడ్డికి సుప్రీమ్ కోర్టు అనుమతి
న్యూఢిల్లీ, 30 ఆగస్టు (హి.స.):తాడిపత్రి వెళ్లేందుకు వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. ఏపీ హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ ఉత్తర్వులను నిలిపివేసింది. తాడిపత్రిలోని తన ఇంటికి వెళ్లేందుకు భద్రత కల్పించాలని ఆయన గతంల
తాడిపత్రి.వెళ్లేందుకు వైసిపి మాజీ.ఎమ్మెల్యే కేతి రెడ్డి పెద్దా రెడ్డికి సుప్రీమ్ కోర్టు అనుమతి


న్యూఢిల్లీ, 30 ఆగస్టు (హి.స.):తాడిపత్రి వెళ్లేందుకు వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. ఏపీ హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ ఉత్తర్వులను నిలిపివేసింది. తాడిపత్రిలోని తన ఇంటికి వెళ్లేందుకు భద్రత కల్పించాలని ఆయన గతంలో హైకోర్టును ఆశ్రయించగా.. పోలీసులు భద్రత కల్పించాలని సింగిల్‌ జడ్జి బెంచ్‌ తీర్పు ఇచ్చింది. ఆ ఉత్తర్వులను అనంతపురం ఎస్పీ సవాల్‌ చేశారు. ఆ తీర్పును హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ రద్దు చేసింది. ఈ ఆదేశాలపై పెద్దారెడ్డి ఈ నెల 22న సుప్రీంకోర్టుకు వెళ్లారు. ఆయన పిటిషన్‌పై శుక్రవారం జస్టిస్‌ విక్రమ్‌నాథ్‌, జస్టిస్‌ సందీప్‌ మెహతాతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. పిటిషనర్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది సిద్ధార్థ్‌ దవే, అల్లంకి రమేశ్‌ వాదనలు వినిపించారు. భద్రతకు అవసరమైన ఖర్చులన్నీ తామే భరిస్తామని తెలియజేశారు. దీంతో ధర్మాసనం ఏపీ హైకోర్టు సింగిల్‌ జడ్జి ఉత్తర్వులను సమర్థించింది. డివిజన్‌ బెంచ్‌ ఉత్తర్వులపై స్టే విధించింది. పెద్దారెడ్డి తాడిపత్రి వెళ్లేందుకు అనుమతి ఇస్తూ.. విచారణను ముగించింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande