శ్రీశైలం జలాశయం దగ్గర తప్పిన పెనుముప్పు
శ్రీశైలం, 30 ఆగస్టు (హి.స.) రెండు తెలుగురాష్ట్రాల్లో(Telugu States) పలుచోట్ల వర్షాలు పడుతున్న విషయం తెలిసిందే. అటు ఎగువ రాష్ట్రాల్లోనూ వానలు కురుస్తున్నాయి. ఈ మేరకు వరద నీటితో కృష్ణా, గోదావరి నదులు(Godavari Nadulu) ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో ఏపీ
శ్రీశైలం


శ్రీశైలం, 30 ఆగస్టు (హి.స.) రెండు తెలుగురాష్ట్రాల్లో(Telugu States) పలుచోట్ల వర్షాలు పడుతున్న విషయం తెలిసిందే. అటు ఎగువ రాష్ట్రాల్లోనూ వానలు కురుస్తున్నాయి. ఈ మేరకు వరద నీటితో కృష్ణా, గోదావరి నదులు(Godavari Nadulu) ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో ఏపీ(Ap), తెలంగాణ(Telangana)లో ప్రాజెక్టులు కూడా ఫుల్ అయ్యాయి.

అయితే శ్రీశైలం జలాశయం(Srisalam Project) వద్ద ఇవాళ పెను ముప్పు తప్పించింది. ప్రాజెక్టు దగ్గర కొండచరియలు(Landslides) విరిగిపడ్డాయి. అంతేకాదు దిగువన రోడ్డుపై పడ్డాయి. ఆ సమయంలో వాహనాలు రాకపోవడంతో ప్రమాదం తప్పింది. ప్రస్తుతం రోడ్డుపై పడిన కొండచరియలతో వాహన రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. దీంతో రోడ్డుపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. స్లోగా ముందుకు కదులుతుండటంతో రోడ్డు దాటడానికి భారీగా సమయం పడుతోంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande