అమరావతి, 30 ఆగస్టు (హి.స.)ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (Andhra Pradesh Government) మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఇంచార్జ్‌గా డాక్టర్ జి.రఘునందన్ (G Raghunandan) నియమించింది. ఈ మేరకు సీఎం చంద్రబాబు (CM Chandrababu) కూడా ఆమోదం తెలిపారు. అయితే, ప్రస్తుతం డీఎంఈగా ఉన్న డాక్టర్ డీఎస్‌బీఎల్ నరసింహం (DSBL Narasimham) రేపు ఉద్యోగ విరమణ చేస్తుండటంతో ఆయన స్థానంలో జి.రఘునందర్ బాధ్యతలు స్వీకరించబోతున్నారు. కాగా, రఘునందర్ గతంలో కర్నూలు మెడికల్ కాలేజీలో అసోసియేట్ ప్రొఫెసర్‌గా పని చేశారు. ప్రస్తుతం ఆయన ఆంధ్రప్రదేశ్ మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ (అకడమిక్)గాను విధులు నిర్వర్తిస్తున్నారు. అకాడమిక్ వ్యవహారాలను పర్యవేక్షించడంలో రఘునందన్‌కు మంచి పేరు ఉంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి