తిరుమలలో భారీగా తగ్గిన భక్తుల రద్దీ.. అతితక్కువ సమయంలో సర్వదర్శనం
తిరుమల, 30 ఆగస్టు (హి.స.)తిరుమలలో భక్తుల రద్దీ భారీగా తగ్గింది. ప్రస్తుతం 9 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉండగా.. టోకెన్లు లేని భక్తులకు శ్రీ వెంకటేశ్వర స్వామివారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతుందని టీటీడీ వెల్లడించింది. SSD /DD టోకెన్లు ఉన్
తిరుమలతిరుమల


తిరుమల, 30 ఆగస్టు (హి.స.)తిరుమలలో భక్తుల రద్దీ భారీగా తగ్గింది. ప్రస్తుతం 9 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉండగా.. టోకెన్లు లేని భక్తులకు శ్రీ వెంకటేశ్వర స్వామివారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతుందని టీటీడీ వెల్లడించింది.

SSD /DD టోకెన్లు ఉన్న భక్తులకు శ్రీ వెంకటేశ్వర వారి దర్శనానికి సుమారు 3 నుంచి 4 గంటల సమయం, రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనానికి సుమారు 2-3 గంటల సమయం పడుతుందని తెలిపింది. కొత్తగా క్యూలైన్లలోకి వెళ్లే భక్తులకు శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనానికి 9 గంటల సమయం పట్టవచ్చని టీటీడీ పేర్కొంది.

నిన్న (శుక్రవారం) శ్రీ వెంకటేశ్వర స్వామివారిని 65,717 మంది భక్తులు దర్శించుకోగా..22,445 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. అలాగే నిన్న స్వామివారి హుండీ ఆదాయం రూ.3.39 కోట్లు వచ్చినట్లు టీటీడీ తెలిపింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande