జమ్మూకశ్మీర్‌లో మరో క్లౌడ్‌ బరస్ట్.. పలువురు మృతి
శ్రీనగర్, 30 ఆగస్టు (హి.స.)జమ్మూకశ్మీర్‌ను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. ఉత్తరాన కశ్మీర్‌ నుంచి దక్షిణాన కన్యాకుమారి వరకు.. పశ్చిమాన రాణ్‌ ఆఫ్‌ కచ్‌ నుంచి తూర్పున దీపూపాస్‌ వరకు అంతటా భారీ వర్షాలు, వరదల బీభత్సం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో రాంబాన
జమ్మూకశ్మీర్‌లో మరో క్లౌడ్‌ బరస్ట్.. పలువురు మృతి


శ్రీనగర్, 30 ఆగస్టు (హి.స.)జమ్మూకశ్మీర్‌ను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. ఉత్తరాన కశ్మీర్‌ నుంచి దక్షిణాన కన్యాకుమారి వరకు.. పశ్చిమాన రాణ్‌ ఆఫ్‌ కచ్‌ నుంచి తూర్పున దీపూపాస్‌ వరకు అంతటా భారీ వర్షాలు, వరదల బీభత్సం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో రాంబాన్‌ జిల్లాలో మరో క్లౌడ్‌ బరస్ట్‌ సంభవించింది. ఈ విపత్తులో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు గల్లంతైనట్లు తెలుస్తోంది. ఈ సంఘటనలో మరణించిన ముగ్గురి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. మృతిచెందిన వారిలో ఇద్దరు మహిళలను గుర్తించినట్లు పేర్కొన్నారు.

గత కొన్ని రోజులుగా జమ్మూకశ్మీర్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీని ఫలితంగా కేంద్రపాలిత ప్రాంతంలో అనేక క్లౌడ్‌ బరస్టులు, ఆకస్మిక వరదలు సంభవిస్తున్నాయి.

ఈ రోజు కూడా బండిపోరా జిల్లాలోని గురేజ్ సెక్టార్‌లో మరో క్లౌడ్‌ బరస్ట్‌ జరగినట్లు అధికారులు తెలిపారు. ఈ సంఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని స్పష్టం చేశారు. భారీ వర్షాల కారణంగా పరిస్థితి మరింత దిగజారుతుందని ఉప ముఖ్యమంత్రి సురీందర్ చౌదరి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు 2014లో కశ్మీర్‌లో వరదలు వచ్చిన తర్వాత ప్రకటించిన రూ.80,000 కోట్ల ప్యాకేజీని జమ్మూ ప్రాంతానికి రెట్టింపు మంజూరు చేయాలని ప్రధాని నరేంద్ర మోదీని కోరినట్లు తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande