నంద్యాల జిల్లాలో గణేష్ నిమజ్జనం లో ఉద్రిక్తత
నంద్యాల, 30 ఆగస్టు (హి.స.)దేశవ్యాప్తంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు (Ganesh Navratri celebrations) వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో పలు ప్రాంతాల్లో నిన్నటి రాత్రి నుంచి నిమజ్జనాలు ప్రారంభం అయ్యాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడు రాత్రులకు విన
tension-over-ganesh-immersion-in-nandyal-district-470577


నంద్యాల, 30 ఆగస్టు (హి.స.)దేశవ్యాప్తంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు (Ganesh Navratri celebrations) వైభవంగా కొనసాగుతున్నాయి.

ఈ క్రమంలో పలు ప్రాంతాల్లో నిన్నటి రాత్రి నుంచి నిమజ్జనాలు ప్రారంభం అయ్యాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడు రాత్రులకు వినాయకుడి నిమజ్జనాలు పెద్ద ఎత్తున చేయడం ఆనవాయితీగా మారింది.

ఇందులో భాగంగా శుక్రవారం రాత్రి నంద్యాల జిల్లా వెలుగోడు లోని ఎస్సీ కాలనీలో వినాయకుడి ఊరేగింపు ప్రారంభించగా.. రాత్రి సమయంలో ఓ వర్గానికి చెందిన వారు.. సౌండ్ సిస్టమ్ ఆపేయాలని గొడవకు దిగారు. దీంతో రెండు వర్షాల మధ్య ఘర్షణ చెలరేగింది. ఈ సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా చూసుకున్నారు. అలాగే ఘటనా స్థలంలో ఉండి ఇరు వర్గాలతో కలెక్టర్, పోలీసులు చర్చలు జరిపారు. కాగా ఈ ఘర్షనలకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande