తిరుమల , 30 ఆగస్టు (హి.స.)తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బీఆర్ నాయుడు ఈ రోజు తుదిదశ నిర్మాణంలో ఉన్న వెంకటాద్రి నిలయం యాత్రికుల ఉచిత సముదాయాన్ని పరిశీలించారు. 2018 లో జరిగిన బోర్డు నిర్ణయం మేరకు పీఏసి -5లో భాగంగా ఈ నిర్మాణం చేపడుతున్న సంగతి తెలిసిందే. 102 కోట్లు వ్యయంతో 5 అంతస్తుల ఉచిత సముదాయాన్ని టీటీడీ నిర్మించారు. ఇందులో పీఏసి 5 ద్వారా 2500 మంది భక్తులకు ఉచిత వసతి సౌకర్యం కల్పించనున్నారు. 216 మరుగుదొడ్లు, 216 స్నానపు గదులు, 2 కళ్యాణకట్టలు, జల ప్రసాదాలను అదనపు ఈవో వెంకయ్య చౌదరి, అధికార యంత్రాంగంతో కలిసి పనులను పరిశీలించినట్లు బీఆర్ నాయుడు తన ఎక్స్ ఖాతాలో రాసుకొచ్చాడు. ఈ పీఏసి 5 తో సామాన్య భక్తులకు మరింత సౌకర్యవంతంగా ఉచిత వసతి అందిస్తామని ఈ సందర్భంగా ఆయన అభిప్రాయపడ్డారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి