ఓటర్ అధికార్ యాత్ర’కు యూసుఫ్ పఠాన్
కోల్‌కతా:,30 ,ఆగస్టు (హి.స.) బీహార్‌లో ఓటరు జాబితా సవరణ పేరుతో కొందరు ఓటర్ల పేర్లను ప్రభుత్వం తొలగించిందని ఆరోపిస్తూ ప్రతిపక్ష నేతలు ‘ఓటర్ అధికార్ యాత్ర’ను నిర్వహిస్తున్నారు. ఇప్పుడు ఈ యాత్రలో టీఎంసీ నేత, మాజీ క్రికెటర్‌ యూసుఫ్ పఠాన్ భాగస్వాములు కాను
Voter ID


కోల్‌కతా:,30 ,ఆగస్టు (హి.స.) బీహార్‌లో ఓటరు జాబితా సవరణ పేరుతో కొందరు ఓటర్ల పేర్లను ప్రభుత్వం తొలగించిందని ఆరోపిస్తూ ప్రతిపక్ష నేతలు ‘ఓటర్ అధికార్ యాత్ర’ను నిర్వహిస్తున్నారు. ఇప్పుడు ఈ యాత్రలో టీఎంసీ నేత, మాజీ క్రికెటర్‌ యూసుఫ్ పఠాన్ భాగస్వాములు కానున్నారు. ఆయనతో పాటు మరో టీఎంసీ నేత లలితేష్ త్రిపాఠి కూడా ఈ యాత్రలో పాల్గొననున్నారు.

సెప్టెంబర్ ఒకటిన బీహార్‌లో జరిగే ‘ఓటర్ అధికార్ యాత్ర’లో యూసుఫ్ పఠాన్, లలితేష్ త్రిపాఠిలు తృణమూల్ కాంగ్రెస్ తరపున పాల్గొంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఆగస్టు 17న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఈ పాదయాత్రను ప్రారంభించారు. బీహార్‌లో చేపట్టిన ప్రత్యేక ఇంటెన్సివ్ ఓటర్ల జాబితా సవరణను వ్యతిరేకిస్తూ ఈ యాత్రను చేపట్టారు. సోమవారం(సెప్టెంబరు ఒకటి)పట్నాలో జరిగే ఊరేగింపుతో ‘ఓటర్ అధికార్ యాత్ర’ ముగియనుంది. యూసుఫ్ పఠాన్, లలితేష్ త్రిపాఠిలు పట్నాలో జరిగే ‘ఓటర్ అధికార్ యాత్ర’కు ప్రాతినిధ్యం వహించనున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande