‘జగన్ వారికి మద్దతివ్వడం దారుణం’: YS షర్మిల కీలక వ్యాఖ్యలు
అమరావతి, 30 ఆగస్టు (హి.స.)రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం, మాజీ సీఎం జగన్‌పై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల(YS Sharmila) సీరియస్ కామెంట్స్ చేశారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా పోస్టు చేశారు. ‘‘ఉపరాష్ట్రపతి ఎన్నికలో NDA అభ్యర్థికి చంద్రబాబు, పవన
షర్మిల


అమరావతి, 30 ఆగస్టు (హి.స.)రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం, మాజీ సీఎం జగన్‌పై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల(YS Sharmila) సీరియస్ కామెంట్స్ చేశారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా పోస్టు చేశారు. ‘‘ఉపరాష్ట్రపతి ఎన్నికలో NDA అభ్యర్థికి చంద్రబాబు, పవన్ కల్యాణ్, జగన్ మద్దతు ఇస్తున్నారు. తమది బీజేపీ మిత్రపక్షం అని చంద్రబాబు చెబుతున్నారు. కానీ తెలుగు జాతి ఆత్మగౌరవం కోసమే టీడీపీ పెట్టామని చెప్తారు కదా. మరి ఇవాళ ఇండియా కూటమి అభ్యర్థిగా తెలుగు వ్యక్తి నిలబడితే ఎందుకు మద్దతు ఇవ్వలేదు?. ఆనాడు పీవీ నరసింహరావు కోసం NTR నంద్యాల సీట్ వదులుకున్నారు. తెలుగు బిడ్డ ఉన్నత స్థాయిలో ఉండాలి అనుకున్నారు. కానీ ఇవాళ మాత్రం తెలుగు తమ్ముళ్లు, తెలుగు జాతి ముఖ్యం అనుకోవడం లేదు. చంద్రబాబుకి తెలుగు జాతి కంటే.. మోడీ ఖ్యాతి ముఖ్యం. తెలుగు వారి ఆత్మగౌరవం కంటే.. మోడీ ఆత్మగౌరవం ముఖ్యం. RSS వాది అయిన NDA అభ్యర్థికి చంద్రబాబు మద్దతు ఇవ్వడం నిస్సిగ్గుగా ఉంది.

ఇక YCP మతతత్వ బీజేపీకి మద్దతు ఇవ్వడం దారుణం. మోడీకి జగన్ దత్తపుత్రుడు. ఇది ప్రపంచం అంతా తెలుసు. ఇండియా కూటమి అభ్యర్థి రాజకీయాలకు అతీతం. సుదర్శన్ రెడ్డి న్యాయ నిపుణులు. న్యాయమూర్తిగా గిరిజనల పట్ల, పేదవాడి అభివృద్ధి పట్ల ఎన్నో గర్వించదగ్గ తీర్పులు ఇచ్చిన గొప్ప వ్యక్తి. అటువంటి తెలుగు బిడ్డ జగన్ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. అయినా మద్దతు ప్రకటించలేదు. బీజేపీతో అక్రమ పొత్తు పెట్టుకున్నారు కాబట్టే NDA అభ్యర్థికి , RSS వ్యక్తికి మద్దతు ఇచ్చారు. అసలు RSS వాదికి, NDA అభ్యర్థికి ఎందుకు జగన్ మద్దతు ఇచ్చారో సమాధానం చెప్పాలి’’ అని షర్మిల డిమాండ్ చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande