లక్ష కోట్లతో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్ట్ నాలుగేళ్లలోనే కూలింది
హైదరాబాద్, 31 ఆగస్టు (హి.స.)కేబినెట్‌ అనుమతి లేకుండానే కాళేశ్వరం ప్రాజెక్టుపై కేసీఆర్ ప్రభుత్వం ముందుకు వెళ్లిందని మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి తెలిపారు. కాళేశ్వరం పూర్తి చేయడానికి రూ.లక్షా 27 వేలకోట్లు అవసరమని పేర్కొన్నారు. లక్ష కోట్లు ఖర్చు పెట్టి
Assembly


హైదరాబాద్, 31 ఆగస్టు (హి.స.)కేబినెట్‌ అనుమతి లేకుండానే కాళేశ్వరం ప్రాజెక్టుపై కేసీఆర్ ప్రభుత్వం ముందుకు వెళ్లిందని మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి తెలిపారు. కాళేశ్వరం పూర్తి చేయడానికి రూ.లక్షా 27 వేలకోట్లు అవసరమని పేర్కొన్నారు. లక్ష కోట్లు ఖర్చు పెట్టి కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టుతో లక్ష ఎకరాల కొత్త ఆయకట్టుకు కూడా నీరు ఇవ్వలేదని వెల్లడించారు. లక్ష కోట్లతో కట్టిన ప్రాజెక్ట్ నాలుగేళ్లలోనే కూలిందని మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

కాళేశ్వరం కమిషన్‌ నివేదికపై తెలంగాణ అసెంబ్లీలో చర్చ జరుగుతోంది. కాళేశ్వరంపై జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్‌ ఇచ్చిన నివేదికపై లఘుచర్చను ప్రారంభించారు మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి . కాళేశ్వరం ప్రాజెక్టుకు రూ.87,449 కోట్ల ఖర్చు అయిందని తెలిపారు. నిరుపయోగంగా మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం ఉన్నాయని చెప్పుకొచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు గుండెకాయలాంటి మేడిగడ్డ కూలిందని వివరించారు. 20 నెలల నుంచి ఈ ప్రాజెక్టు నిరుపయోగంగా ఉండటం బాధాకరమని పేర్కొన్నారు మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి.

అతిపెద్ద ప్రాజెక్టుగా కాళేశ్వరం పనులను కేసీఆర్ ప్రభుత్వం ప్రారంభించిందని గుర్తుచేశారు. తెలంగాణకు ఇది చాలా బాధాకరమైన రోజు అని అభిప్రాయపడ్డారు. ప్రాణహిత - చేవెళ్ల కట్టాలని 2013లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని గుర్తుచేశారు. ప్రాణహిత - చేవెళ్లపై 2014 నాటికే రూ.11,600 కోట్లను అప్పటి ప్రభుత్వం ఖర్చు చేసిందని స్పష్టం చేశారు. మేడిగడ్డ దగ్గర ప్రాజెక్టు సరికాదని నాటి ప్రభుత్వ కమిటీ చెప్పిందని వివరించారు. వాప్కోస్‌ రిపోర్టు రావడానికి ముందే మేడిగడ్డ బ్యారేజ్‌‌‌ను కట్టాలని కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని.. సాంకేతిక అంశాలను ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదని ప్రశ్నించారు. అయితే మంత్రి ఉత్తమ్‌ ప్రసంగానికి అడుగడుగునా బీఆర్ఎస్ నేతలు అడ్డుపడారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు


 rajesh pande