బీసీలకు ఉన్న అనుమానాలను ప్రభుత్వం నివృత్తి చేయాలి.. పాయల్ శంకర్
హైదరాబాద్, 31 ఆగస్టు (హి.స.) తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో నేడు బీజేపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పాయల్ శంకర్ ప్రభుత్వాన్ని తీవ్రంగా ప్రశ్నించారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో బీజేపీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని స్పష్టంచేశారు. అయితే బీసీలకు ఉన్న అనుమానాలను ప్రభు
పాయిల్ శంకర్


హైదరాబాద్, 31 ఆగస్టు (హి.స.)

తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో నేడు

బీజేపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పాయల్ శంకర్ ప్రభుత్వాన్ని తీవ్రంగా ప్రశ్నించారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో బీజేపీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని స్పష్టంచేశారు. అయితే బీసీలకు ఉన్న అనుమానాలను ప్రభుత్వం నివృత్తి చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. కామారెడ్డి డిక్లరేషన్పై అసెంబ్లీలో చర్చ జరగాలని డిమాండ్ చేశారు. “బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇవ్వాల్సిందే. మీ చేతిలో ఉన్న అధికారాన్ని పంచిపెట్టడంలో ఏమాత్రం అభ్యంతరం ఉంది?” అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande