హైదరాబాద్, 31 ఆగస్టు (హి.స.)
తెలంగాణ వర్షాకాల సమావేశాలు
నేడు ప్రారంభం అయ్యాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై కట్టుబడి ఉందని ఈ సందర్భంగా సీఎం రేవంత్ సభలో చెప్పుకొచ్చారు. అనంతరం బీసీ రిజర్వేషన్లపై బీజేపీ VS కాంగ్రెస్ గా హాట్ హాట్ గా చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో మంత్రులు శ్రీహరి, శ్రీధర్ బాబు బీజేపీ తీరుపై ఫైర్ అయ్యారు. బీసీ రిజర్వేషన్లపై బీజేపీ స్పష్టమైన తెలపాలని డిమాండ్ చేశారు. అలాగే బీజేపీ.. బీసీ బిల్లును వ్యతిరేకిస్తుందని మంత్రులు ఫైర్ అయ్యారు.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..