బాసర ఆలయ స్పెషల్ ఆఫీసర్గా సాంకేతి కుమార్.. కలెక్టర్ ఉత్తర్వులు
తెలంగాణ, నిర్మల్.31 ఆగస్టు (హి.స.) తెలంగాణలో పవిత్ర పుణ్యక్షేత్రమైన బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయ స్పెషల్ ఆఫీసర్ గా భైంసా సబ్ కలెక్టర్ అజ్మీరా సాంకేత్ కుమార్ ను నియమిస్తూ నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు.
బాసర ఆఫీసర్


తెలంగాణ, నిర్మల్.31 ఆగస్టు (హి.స.)

తెలంగాణలో పవిత్ర పుణ్యక్షేత్రమైన బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయ స్పెషల్ ఆఫీసర్ గా భైంసా సబ్ కలెక్టర్ అజ్మీరా సాంకేత్ కుమార్ ను నియమిస్తూ నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. గత రెండు సంవత్సరాలుగా వస్తున్న ఇతరాత్ర ఫిర్యాదుల నేపథ్యంలో బాసర ఆలయ ప్రతిష్ట, భక్తుల నిత్య అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఈ ఉత్తర్వులు జారీ చేస్తున్నట్లు ఓ ప్రకటన జారీ చేశారు. ఈ రోజు నుంచి సబ్ కలెక్టర్ అజ్మీరా సాంకేత్ కుమార్ విధులలో జాయిన్ అవ్వనున్నారు. రానున్న నవరాత్రుల నేపథ్యంలో కలెక్టర్ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం హర్షణీయమని భక్తులు అంటున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande